LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

Half Pay Leave

Posted by VIDYAVARADHI on Monday 21 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 అర్థజీతపు సెలవు (Half Pay Leave)


💎 ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.


💎 సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది. సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు. (G.O.Ms.No.165 Dt:17-08-1967)


💎 ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.


💎 అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.


💎 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.

1⃣ వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)

2⃣ స్వంత వ్యవహారాలపై (Private Affairs)


💎 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.


💎 ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.


💎 వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు. {APLR 15(B) & 18(B}


💎 కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది. (G.O.Ms.No.186 Dt:23-07-1975)


💎 సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}


💎 ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.


💎 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.


💎 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు. (Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)

                (Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)


💎 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.


💎 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.

(G.O.Ms.No.386 Dt:06-09-1996)

(G.O.Ms.No.449 Dt:19-10-1976)


💎 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.

    (G.O.Ms.No.29 Dt:09-03-2011)


💎 ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు.

    (G.O.Ms.No.143 Dt:01-06-1968)


💎 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.


💎 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.

    (G.O.Ms.No.33 F&P 


మీ సందేహాలు - మా సమాధానాలు 

ప్రశ్న :  మా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు అక్టోబర్ లో పదవీ విరమణ గా వించబోతున్నారు. ఆమె ఖాతాలో 500 అర్థవేతన సెలవులున్నాయి. పదవీ విరమణ సమయంలో వీటిని నగదుగా మార్చుకొనవచ్చునా ? 

సమాధానం  :  మార్చుకోవచ్చును. రాష్ట్ర ప్రభుత్వం G.O.MS. No. 109, Finance, తేది : 29-7-2015 ద్వారా అర్థవేతన సెలవులను నగదుగా మార్చుకొనే అవకాశం కల్పించింది. అయితే రోజుల పరిమితికి లోబడి లెక్కిస్తారు. అర్థవేతన సెలవు పొందడానికి సూత్రం  =  పదవీ విరమణ తేదికి అర్థవేతనం + అర్థవేతనంపై ఆ రోజుకు చెల్లిస్తున్న DA/30 X అర్థవేతన సెలవులు.

Half Pay Leave
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 21, 2020

0 comments:

Post a Comment