LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

How to Apply Scholarships @ E PASS website

Posted by VIDYAVARADHI on Saturday 14 November 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 How to Apply Scholarships @ E PASS website

ఉపకార వేతనాలకై ఈ-పాస్ నందు రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం :-

2021-22 విద్యాసంవత్సరంలో వివిధ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్న షెడ్యూల్డు కులాల SC,ST,BC,MINORITY and Disable welfare విద్యార్థులలోని అర్హత కలిగిన విద్యార్థులు ( ఫ్రెష్ మరియు రెనెవల్) ఉపకార వేతనాలు ( ఫీజు మరియు మెయింటెనెన్స్ చార్జీలు) పొందేందుకు తమ అప్లికేషన్ (తమ వివరాలు) ను ఈ-పాస్ వెబ్సైట్ "http://telanganaepass.cgg.gov.in" నందు అప్‌లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ నెల 24 వ తేదీ (సెప్టెంబర్ 24) నుంచి వచ్చే నెల 24 వ తేదీ (అక్టోబర్ 24) వరకు ఈ - పాస్ వెబ‌్సైట్ అప్లికేషన్‌లను అప్లోడ్ చేసుకునేందుకు తెరిచి / అందుబాటులో ఉంటుంది. 

కాబట్టి  షెడ్యూల్డు కులాల SC,ST,BC,MINORITY and Disable welfare కు చెందిన కళాశాల విద్యార్థులు అందరూ (అర్హులైనవారు) ఈ అవకాశం వినియోగించుకోవాలనీ, సదరు కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థులకు ఇట్టి సమాచారం అందజేసి వారిచే ఈ-పాస్ వెబ్సైట్ నందు ఉపకార వేతనాలకై రిజిస్ట్రేషన్ చేసుకావాలి.

ప్రి- మెట్రిక్ స్కాలర్షిప్ అవకాశం
5 నుండి 10వ, తరగతి చదువుతున్న
 SC,ST & BC విద్యార్థులకు 
ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కొరకు తెలంగాణ e pass వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
 👉 Scholarship apply చేయడానికి విద్యార్థి యొక్క 
1.ఒక పాస్ ఫోటో 
2.క్యాస్ట్ సర్టిఫికెట్ 
3.ఇన్కమ్ సర్టిఫికెట్ 
4.రేషన్ కార్డ్ 
5.విద్యార్థి పేరు మీద బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ 
6.విద్యార్థి యొక్క ఆధార్ కార్డు 
 ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పొందడానికి  అర్హతలు 
  1. విద్యార్థుల ఇన్కమ్ సర్టిఫికెట్ ఏప్రిల్-2020 తర్వాత తీసినది ఉండాలి.
  2.  ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి.
  3.   బిసి మరియు ఈ బీసీ విద్యార్థుల ఆదాయం లక్షన్నర లోపు ఉండాలి.
  4.  డిసేబుల్ విద్యార్థుల ఆదాయం లక్ష కంటే ఎక్కువ ఉండవచ్చు. 
  5.  స్కాలర్ షిప్ అప్లై చేస్తున్న విద్యార్థి హాజరు శాతం తప్పనిసరిగా 75 శాతం ఉండాలి. 
  6. విద్యార్థులకు పది నెలలకు స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది.
  7. నెలకు వంద రూపాయల చొప్పున వెయ్యి రూపాయలు మంజూరు చేయబడతాయి.
  8.  ఎస్సీ ఎస్టీ బాయ్స్ కు 100 రూపాయలు నెలకు, 
  9.  ఎస్సీ ఎస్టీ గర్ల్స్ అయితే నెలకు నూట యాభై రూపాయలు మంజూరు చేయబడుతుంది.
  10.  9,10వ,తరగతి విద్యార్ధులకు నెలకు 300 రూపాయల చొప్పున,10 నెలలకు 3000రూపాయలు మరియు అదనంగా ₹1000 రీడింగ్ సామగ్రి కొనుగోలుకు మంజూరు చేయబడుతాయి.
మీ స్కూల్ / కాలేజీలో సబ్మిట్ చేయవలసినవి
  • ప్రింటెడ్ అప్లికేషన్
  • ఆధార్ కార్డు జిరాక్స్
  • ఆదాయం సర్టిఫికెట్ జిరాక్స్
  • స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్
  • బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
  • కులం సర్టిఫికేట్ జిరాక్స్
మొదటగా కింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయండి మీరు అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్తారు
ఆ పేజీలో క్రింది కి వెళ్లండి అక్కడ pre మెట్రిక్  బటన్  కనబడుతుంది దాని పైన క్లిక్ చేయండి
తర్వాత పేజీ లో రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది దాని పైన క్లిక్ చేసి మీ యొక్క వివరాలను సబ్మిట్ చేయండి
స్కాన్ చేయవలసినవి
  • బ్యాంక్ పాస్ బుక్ (ఇది 100 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి)
  • ఆధార్ కార్డ్ (ఇది 100 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి)
  • ఫోటో(ఇది 50 kbకంటే తక్కువ సైజులో అప్లోడ్ చేయండి)

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 14, 2020

0 comments:

Post a Comment