LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

విభిన్న ప్రతిభావంతులు అలవెన్సులు ఉత్తర్వులు

Posted by VIDYAVARADHI on Friday 25 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 విభిన్న ప్రతిభావంతులు అలవెన్సులు ఉత్తర్వులు:


*విభిన్న ప్రతిభావంతుల ఆత్మన్యునతా భావాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యాన్ని పెంపోందించి ప్రోత్సహించుటకు గానూ వీరికి ప్రభుత్వం ప్రత్యేక విద్యా సౌకర్యాలు, ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు, సహాయకుని తోడ్పాటు, రుణాల సౌకర్యం కల్పించబడినవి.*


*కన్వేయన్సు అలవెన్సు పొందడానికి 40 శాతం అంగవైకల్యం ఉన్నవారికి ఇస్తారు. వైధ్య ధ్రువపత్రము దాఖలు చేయాలి.*


*2015 పి.అర్.సి లో కన్వేయన్సు అలవెన్సు బేసిక్ పే పై 10 శాతం లేదా గరిష్టంగా రూ.2000 చెల్లిస్తారు.*

*(G.O.Ms.No.103 తేది:24-7-2015)*


*పుట్టుకతో అవయవలోపమున్న వారితోపాటు మధ్యలో అవయవలోపం ఏర్పడిన వారు కూడా కన్వేయన్సు అలవెన్సుకు అర్హులే*


*ఉద్యోగి నివసిస్తున్న కాంపౌండ్ నందు విధులు నిర్వహించుచున్నను కన్వేయన్సు అలవెన్సుకు అర్హత ఉంది.*


*వికలాంగులకిచ్చెడి కన్వేయన్సు అలవెన్సు దసరా,సంక్రాంతి,వేసవి సెలవుల కాలమునకు చెల్లించబడదు. అయితే క్యాజువల్ సెలవులకు చెల్లించబడుతుంది. అర్ధజీతపు, సంపాదిత, జీత నష్టపు సెలవులు వాడుకున్ననువఈ అలవెన్సు చెల్లించబడదు.* *(G.O.Ms.No.226 తేది:05-08-1981)*


*రీడర్ అలవెన్స్:*

*చూపులేని ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను చదవడానికి తనతో ఒక వ్యక్తిని పాఠశాలకు తీసుకునిరావచ్చును. అట్టి వ్యక్తికి రీడర్ అలవెన్స్ చెల్లిస్తారు. అందుకు గాను సదరు ఉపాధ్యాయుడు సివిల్ సర్జన్ నుండి వైద్య ధృవపత్రమును పొంది దానిని యాజమాన్యమునకు పంపుకొని రీడర్ ను ఏర్పాటు చేసుకొనుటకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం 2015 PRC లో  రీడర్ అలవెన్స్ పెంచుతూ *G.O.Ms.No.04 Fin తేది :19-03-2016* విడుదలచేసారు. పై ఉత్తర్వుల ప్రకారం


*-SGT,క్రాఫ్ట్ తత్సమాన క్యాటగిరికి ప్రతినెలా RS 1200/-*


*-స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ప్రతినెలా Rs.1500*


*-జూనియర్ లెక్చరర్స్ మరియు పై స్థాయి Rs.2000*


*ఒక కన్ను కనపడని ఉద్యోగులు కన్వేయన్సు అలవెన్సుకు అర్హులుకారు.*

*(G.O.Ms.No.262 తేది:25-08-1980)*


*చెవుడు అంగవైకల్యముగా గుర్తించబడినప్పటికి అట్టి ఉద్యోగులకు/టీచర్లకు ఎటువంటి అలవెన్సు చెల్లించడానికి ఉత్తర్వులు లేవు.*


*శారీరక అంగవైకల్యం (ఏముకలు, కండరాలు) కాళ్ళు, చేతుల యందు అశక్తత కలిగియున్న ఉద్యోగికి వాహన భృతి కల్పించబడును.*

*(G.O.Ms.No.264 తేది:13-10-1981)*


*శారీరక అవయవాల ఏర్పాటు వినికిడి సాధనాలు అమర్చుకొను దృష్టి, దోష నివారణా కంటి అద్దములు/పరికరాలు కృత్రిమదంతాలు బలహీనులకు అవసరమగు కుర్చీల ఖరీదు కొరకు గరిష్టంగా రూ.50 వేల రీయంబర్స్మెంట్ సౌకర్యం ఉంటుంది.*

*(G.O.Ms.No.175 తేది:07-03-1991)*


*వికలాంగులకు ప్రమోషన్లలో 4% రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినది* 

*(G.O.Ms.No.96 తేది:22-07-2019)*


*అంధ ఉద్యోగులకు పదోన్నతుల కై  శాఖపరమైన పరీక్షల ఉత్తీర్ణతకు 5 సం.గడువు ఇవ్వబడింది.*

*(G.O.Ms.No.748 తేది:29-12-2008)*


*అంగవికలురైన ఉద్యోగులకు వృత్తిపన్ను మినహాయింపు ఇవ్వబడింది.*

*(G.O.Ms.No.1063 తేది:02-08-2007)

*Physical Handicapped Conveyance  Allowance

1) 40% శాతం అంగవైకల్యం మరియు గుడ్డి వారు గల  ప్రభుత్వోద్యోగులకు వారి మూలవేతనములో 10 శాతం చొప్పున రూ. 500/-లకు మించకుండ ప్రతినెల వేతనముతోపాటు కాన్వయన్స్  అలవెన్సు గా  చెల్లించారు . ఈ రేటు తేది. 15-10-2005 నుండి వర్తించింది. . (G.O.Ms.No. 276, Dt. 15-10-2005). 


2) ఈ అలవెన్సు మూల వేతనం లో 10%  చొప్పున గరిష్ఠ పరిమితి రూ.650/- లకుమించకుండ ప్రతినెల వేతనముతోపాటు కాన్వయన్స్  అలవెన్సు గా  చెల్లించారు . ఈ రేటు   తేది: 6. 7. 2006  నుండి పెంచబడినది.

(  G.O.Ms.No.197 Dt.6.7.2006 )



3) ఈ అలవెన్సు మూలవేతనంలో 10% చొప్పున గరిష్ఠ పరిమితి రూ.900/- లకు పెంచబడినది. ఈ పెంపుదల తేది. 01-4-2010 నుండి అమలులోనికి వచ్చినది. (G.O.Ms.No. 108, Dt. 7.4.2010 )


4) PRC 2010 లో ఈ అలవెన్సు గరిష్ట పరిమితి రూ. 2000/- గా పెంచబడినది. ( G.O.Ms.No.103 Dt.24.7.2015) . ప్రస్తుతం ఈ GO ప్రకారం అలవెన్సు అందచేయడం జరుగుచున్నది 


5)  జిల్లా మెడికల్ బోర్డు నుండి వైద్య ధృవీకరణ పత్రము జారీ అయిన తేది నుండి ఈ అలవెన్సు చెల్లింపబడుతుంది. ఈ అలవెన్సు సస్పెన్షన్ పీరియడ్ , దసరా, సంక్రాంతి, క్రిస్మస్ మరియు వేసవి సెలవులలో రాదు.  వేసవి సెలవులలో కూడా డ్యూటీ చేయవలసి వస్తే ఈ అలవెన్సు పనిచేసిన కాలానికి లభించును.

nRPS 2015 PHC Allowance is allowed @ 10% of pay  subject to the maximum of Rs. 2,000/- per month as per G.O.Ms. No. 103 Fin. Dt: 24-7-2015 (40% disability of any kind, Hearing handicapped, impairment of 60 db more are eligible for this PHC. Conveyance allowance and through G.O.Ms.No. 31 WD, CW & Dis Welfare Dept.dt: 1-12-2009 the rules and regulations for issued of the handicapped certificate are issued. The same may be followed)

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 25, 2020

0 comments:

Post a Comment