LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

PREFIX - SUFFIX and VACATION

Posted by VIDYAVARADHI on Friday 25 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 PREFIX - SUFFIX

 15 రోజులకు మించిన సెలవులను వెకేషన్ అంతకు తక్కువగా ఉన్న సెలవులను షార్ట్ టర్మ్ సెలవులు అంటారు. వెకేషన్ కాలంలో పాఠశాల మూసివేసే రోజుకాని, తెరిచే రోజు కాని హాజరైనా సరిపోతుంది. కాని షార్ట్ టర్మ్ సెలవులు ప్రకటించే దసరా, సంక్రాంతి సెలవులకు మాత్రం పాఠశాల మూసివేసే రోజు తెరిచే రోజు 2 రోజులు తప్పక హాజరు కావాలి (Rc. No.10324/E42/69, Dt7.11.1969) దసరా, సంక్రాంతి సెలవులు 10 రోజులలోపు గాని  ఇచ్చినప్పుడు మాత్రమే మూసివేసే రోజు, కానీ తెరిచే రోజుకాని సాధారణ సెలవు పెట్టుకోవచ్చు.


వేసవి సెలవులకు ముందు పాఠశాల మూసివేసే రోజుకాని, సెలవుల అనంతరం తెరిచే రోజుకాని జరుకానప్పుడు

సాధారణ సెలవు కాకుండా సంపాదిత/ అర్థవేతన సెలవు మాత్రమే నుంజూరు చేయాలి.


 VACATION  వెకేషన్

💥 ఉద్యోగి సర్వీసులో క్రమం తప్పకుండా వచ్చు వెకేషన్ లో,ఉద్యోగి విధులకు హాజరుకాకుండా ఉండే అవకాశాన్ని వెకేషన్ అంటారు.

*FR-82 under sub rule I*


💥 ఒక ఉద్యోగి వెకేషన్ శాఖలోనూ,వెకేషన్ శాఖగాని వేరే శాఖ లో రెండింటిలో పనిచేసేటప్పుడు,వెకేషన్ శాఖలో పనిచేస్తున్న ట్లు పరిగణించరాదు.

*FR-82 under sub rule-4*


💥 15 రోజులకు మించిన ప్రభుత్వ సెలవుల నే వెకేషన్ గా భావించాలి.

*FR-82 under sub rule-2*


💥 వెకేషన్ శాఖ నుండి నాన్ వెకేషన్ శాఖకు బదిలీ అయితే ఆ ఉద్యోగి సర్వీసు ఆ శాఖలో తాను చివరగా వాడుకున్న వెకేషన్ పూర్తి ఆయిన తేది నుంచి సమాప్తి అయినట్లు భావించాలి.

*FR-82 under sub rule 7*


💥 నాన్ వెకేషన్ శాఖ నుండి వెకేషన్ శాఖకు బదిలీ అయినచో తన సర్వీసు వెకేషన్ శాఖలో చివరి వెకేషన్ పూర్తి ఆయిన తేది నుండి ప్రారంభించినట్లు భావించబడుతుంది.


💥 వెకేషన్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఏదేని వెకేషన్ లో విధులు నిర్వహించడానికి తగిన ప్రతిఫలం ప్రత్యేకంగా పొందినట్లయితే ఆ ఉద్యోగి వెకేషన్ వాడుకోనకుండా నిరోధించినట్లు భావించరాదు-Ruling 15


💥  వెకేషన్ శాఖలో పనిచేయు ఉద్యోగి,ప్రత్యేకమైన ఉత్తర్వుల ద్వారాగాని లేక జనరలు ఉత్తర్వుల ద్వారా గాని అట్టి వెకేషన్ అనుభవించడానికి నిరోధించబడకుండా ఉంటే,అతను వెకేషన్ అనుభవించినట్లే భావించవలెను.

*FR-82 under sub rule-2*


💥 FR-82 లోని సబ్ రూల్.6 ప్రకారం వినియోగించుకున్న వేసవి సెలవులు 15 రోజుల కన్నా  తక్కువ ఉన్నప్పుడు మొత్తం వేసవి సెలవులు కోల్పోయినట్లుగా భావించి 30 సంపాదిత సెలవులు (24+6) జమచేయబడతాయి.


💥 వెకేషన్ శాఖలో పనిచేయు తాత్కాలిక నాల్గవ తరగతి ఉద్యోగులు అర్జిత సెలవులకు అర్హులు కారు.

*Note 1 under APLR20(A)*


💥 ప్రతి ఉపాధ్యాయునికి జనవరి 1వ తేదిన 3 రోజులు,జూలై ఒకటవ తేదిన 3 రోజులు అర్జిత సెలవులు ముందుగా జమచేయాలి.

*G.O.Ms.No.317 విద్య,తేది:15-09-1994*


💥 ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు గాని,జనాభా లెక్కలకు గాని లేక ఇతరత్రా వారి సేవలు ప్రభుత్వం ఉపయోగించుకున్న సందర్భాలలో,అట్టి కాలానికి ఏ మేరకు సంపాదిత సెలవుకు అర్హులో ప్రభుత్వం కాలానుగుణంగా ప్రత్యేక ఉత్తర్వులు జారీచేస్తూ ఉంటుంది.అలాంటి సందర్భాలలో ఉపాధ్యాయులు వెకేషన్ ను ఉపయోగించకుండా నివారింపబడినెల యెడల,వారి సేవలు ఉపయోగించుకున్న అధికారి జారీచేసిన ధృవపత్రము ఆధారంగా శాఖాధిపతి దామాషా పద్దతిపై నిలువచేయుటకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.తదుపరి శాఖాధిపతికి బదులుగా సంస్థాధిపతి ఉత్తర్వులు ఇస్తే సరిపోతుందని సవరణ ఉత్తర్వులు జారీచేసింది.

*G.O.Ms.No.151,విద్య తేది:14-11-2000*

*G.O.Ms.No.174,విద్య తేది:19-12-2000

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 25, 2020

0 comments:

Post a Comment