Cash back for those who do not use the moratorium?
మారటోరియం వాడని వారికి క్యాష్ బ్యాక్?
వాయిదా కట్టకపోయి ఉంటే వడ్డీ పై వడ్డీ భారం
ఎంత పడేదో అంత వెనక్కిచ్చే అవకాశంపై పరిశీలన!
ప్రయోజనం కల్పించే దిశగా కేంద్రం కసరత్తు
లెక్క కష్టమే.. ఈ ఆరు నెలల వాయిదాల చెల్లింపుతో తీరిపోయిన రుణాలూ కొన్ని ఉన్నాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థల నుంచి ఈ లెక్కలన్నీ పక్కాగా వస్తేగానీ.. అసలు లెక్క తేలదు. విధివిధానాలు పక్కాగా రూపొందించడం కుదరదు. దీనికి తోడు బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం ఏదైనా.. ఈ లెక్కలు తేల్చడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించడం మాత్రం కొద్దిగా క్లిష్టమైనవే. ఎందుకంటే మారటోరియాన్ని కొందరు పూర్తిగా ఉపయోగించుకున్నారు. మరికొందరు మూడు నెలలు మాత్రమే ఉపయోగించుకున్నారు. మరికొందరు అసలు ఉపయోగించుకోలేదు.
కొవిడ్ నేపథ్యంలో ప్రకటించిన మారటోరియాన్ని ఉపయోగించుకోనివారికీ వడ్డీ మాఫీ ఉపశమనాన్ని కలిగిస్తామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న కేంద్రం.. ఆ ఉపశమనాన్ని ఎలా కలిగించబోతోంది? మారటోరియం సమయంలో కూడా రుణ చెల్లింపులు జరిపిన చాలా మందికి వస్తున్న సందేహమిది! విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.2 కోట్లలోపు రుణాలు తీసుకుని, క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లించిన వ్యక్తిగత వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్రయోజనం కలిగించే విధంగా ‘క్యాష్ బ్యాక్’ వంటి ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అంటే.. ఒకవేళ వారు కూడా మారటోరియాన్ని వినియోగించుకుని ఉంటే వడ్డీ మీద వడ్డీ పడి వారిపై ఎంత మేరకు భారం పడి ఉండేదో లెక్కించి, అంత సొమ్మును వారికి ఇచ్చే (అసలులో తగ్గించే) అవకాశాలను పరిశీలిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి.
కోవిడ్ కారణంగా పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడడంతో చాలా మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి ఊరట కలిగించేలా మార్చి నుంచి మారటోరియాన్ని ప్రకటించిన ఆర్బీఐ.. అది కేవలం తాత్కాలిక వెసులుబాటేనని, వాయిదాల మొత్తా న్ని అసలుకు కలిపి వడ్డీతో సహా వసూలు చేస్తామని చెప్పడంతో చాలా మంది కష్టపడి వాయిదాలు చెల్లించేశారు. కట్టలేనివారు మారటోరియాన్ని ఉపయోగించుకున్నారు.
వారిపై చక్రవడ్డీ విధిస్తామంటే ఇక మారటోరియం ప్రయోజనం ఎలా నెరవేరినట్లవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో కేంద్రమే ఆ భారాన్ని భరించడానికి సిద్ధమైంది. మారటోరియాన్ని ఉపయోగించుకున్నవారికి ఈ వెసులుబాటు కల్పిస్తూనే.. నిబద్ధతతో వాయిదాలు చెల్లించినవారికీ ఆ ప్రయోజనాలు కల్పిస్తామని స్పష్టం చేసింది.
ఒకవేళ క్యాష్ బ్యాక్ రూపంలో వారికి ఆ ప్రయోజనాన్ని చేకూర్చాలంటే ఎంత ఖర్చవుతుందనే దానిపై ఇంకా ఒక అంచనా రాలేదు. అయితే, రూ.2 కోట్ల లోపు రుణా లు తీసుకున్నవారికే ఈ ప్రయోజనాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో..మొత్తం రుణా ల్లో 30 నుంచి 40 శాతం రుణాలకు ఇది వర్తిస్తుందని ‘ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ’ ఉపాధ్యక్షుడు అనిల్ గుప్తా అభిప్రాయపడ్డారు. కాబట్టి ప్రభుత్వంపై రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల దాకా మాత్ర మే భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment