పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,ఇతర సిబ్బంది తప్పనిసరిగా ప్రార్ధన కు హాజరవ్వాలా లేక ఒక గంట లేట్ పర్మిషన్ కు అనుమతి ఉంటుందా? లేదా ప్రార్ధనకు హాజరుకాకపోతే లేట్ రిజిస్టర్ లో సంతకం చేసి మూడు లేట్ లకు ఒక CL కట్ చేయోచ్చా అను డౌటుకు పాఠశాల విద్యాశాఖ స్పష్టమయిన ఉత్తర్వులు Rc.No.527/E2/97 తేదీ: 16.7.1997 జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 1 గంట లేట్ పర్మిషన్, 3 లేట్ లకు 1 CL అనునది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి కానీ పాఠశాలలకు వర్తించవు అలాగే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది ఖచ్చితంగా ప్రార్ధనకు హాజరవ్వాలని పై ఉత్తర్వులు తెలుపుతున్నాయి.
ఉపాధ్యాయులు,ఇతర సిబ్బంది తప్పనిసరిగా ప్రార్ధన కు హాజరవ్వాలా
Posted by VIDYAVARADHI on Sunday, 26 September 2021

You may also like these Posts
Blog, Updated at: September 26, 2021
0 comments:
Post a Comment